ఆఫీస్ కంప్యూటర్లలో వాట్సాప్ వాడుతున్నారా.. లీకయ్యే ఛాన్స్.. ఇలా అస్సలు చేయకండి..

ఆఫీస్ కంప్యూటర్లలో వాట్సాప్ వాడుతున్నారా.. లీకయ్యే ఛాన్స్.. ఇలా అస్సలు చేయకండి..

ఏదైనా ఫైల్స్, ఫొటోస్ షేర్ చేయాలంటే వాట్సాప్ ద్వారా చాలా ఈజీ. అయితే ఈ వాట్సాప్  ఆఫీస్ కమ్యూనికేషన్స్ కి కూడా చాల ఉపయోగపడుతుంది. ఆఫీస్  కంప్యూటర్లలో వాట్సాప్  వాడడం చాల సాధారణం.  ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆఫీసు కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్‌ వాడొద్దంటూ సలహా ఇస్తుంది. కార్పొరేట్ పరికరాల్లో వాట్సాప్ వెబ్‌ వాడటం వల్ల చాట్స్, పర్సనల్ ఫైల్స్, లాగిన్ వివరాలు సహా అన్ని లీక్ అయ్యే అవకాశం ఉందని చెబుతోంది.

మీ చాట్స్, పర్సనల్  ఫైల్స్, లాగిన్ వివరాలు, స్క్రీన్ మానిటరింగ్ సాఫ్ట్‌వేర్ లేదా మాల్వేర్ లేదా బ్రౌజర్ హైజాక్‌లకు గురికావచ్చు అని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్‌నెస్ (ISEA) బృందం కూడా తెలిపింది. ఆఫీస్ వై-ఫైని ఉపయోగించడం వల్ల కంపెనీలు వాళ్ళ  ఫోన్‌లను కొంతవరకు యాక్సెస్ చేయగలవని, దీనివల్ల ప్రైవేట్ ఫైల్స్,  చాట్‌లపై కన్నేసే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ ఉపయోగించడం వల్ల నష్టాలూ:
*మీ ఆఫీస్ ల్యాప్‌టాప్ హ్యాక్ అయితే మీ వాట్సాప్ చాట్స్  లీకయ్యే  అవకాశం ఉంది. 
*మీరు ఆఫీసులో పబ్లిక్ లేదా సేఫ్ కానీ Wi-Fi నెట్‌వర్క్‌లో WhatsApp వెబ్‌ ఉపయోగిసస్తే మీ డేటాను దొంగిలించొచ్చు. 
*మీ కంపెనీకి డివైజ్ లేదా మానిటరింగ్ సాఫ్ట్‌వేర్ యాక్సెస్ ఉంటే వారు మీ WhatsApp చాట్స్ ఈజీగా చూడొచ్చు. 

మీరు ఆఫీసులో వాట్సాప్ వెబ్‌ ఉపయోగించాల్సి వస్తే, వెళ్లే ముందు లాగ్ అవుట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా తెలియని వారు పంపిన  లింక్‌లపై క్లిక్ చేయడం లేదా అటాచ్‌మెంట్‌లను ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి.