న్యాయవాదుల సంక్షేమానికి ఐఏఎల్ కృషి

న్యాయవాదుల సంక్షేమానికి ఐఏఎల్ కృషి

కోదాడ, వెలుగు : రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ కృషి చేస్తుందని ఆ సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు ఓరుగంటి నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గట్ల నరసింహారావు తెలిపారు. బుధవారం కోదాడ కోర్టు ఆవరణలో ఐఏఎల్ –2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రస్తుతం న్యాయవాదులకు అందుతున్న నగదు రహిత వైద్య సేవలను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచి వారి కుటుంబ సభ్యులందరికీ వర్తింపజేయాలన్నారు. 

మరణించిన న్యాయవాది కుటుంబానికి ప్రభుత్వం అందించే  రూ.10 లక్షల సహాయాన్ని రూ.20 లక్షలకు పెంచడంతోపాటు సీనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉయ్యాల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వెంకటేశ్వర్లు, శరత్ బాబు, హనుమంతరావు, చలం, శ్రీధర్, కేవీ, నవీన్, దావీద్, మురళి, బాలయ్య, నాగరాజు, మంద వెంకటేశ్వర్లు, కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.