ఇండియన్ రైల్వేస్ డిసెంబర్ 1 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చాయి. కొత్త రూల్ ప్రకారం, తత్కాల్ టికెట్ బుకింగ్ ముందు ప్రయాణీకులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే వన్-టైం పాస్‌వర్డ్ (OTP) ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. OTP ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే టికెట్ బుక్ అవుతుంది.
ఈ కొత్త రూల్ మొదటగా వెస్టర్న్ రైల్వే సెలెక్ట్ చేసిన రైళ్లలో ప్రారంభమైంది. ముంబై సెంట్రల్ - అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లో ఈ OTP బుకింగ్‌ను మొదట అమలు చేశారు. అయితే పైలట్ దశ ఫలితాలను చూసిన తర్వాత, దీన్ని క్రమంగా అన్ని జోన్‌లకు విస్తరిస్తామని రైల్వేలు ప్రకటించాయి.
తత్కాల్ టిక్కెట్లు అత్యవసర సమయంలో ప్రయాణం చేసే వారికి మాత్రమే... కానీ చాలా కాలంగా ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. నకిలీ ఫోన్ నంబర్లు వాడటం, అనధికార ఏజెంట్లు లేదా వ్యక్తులు ఒకేసారి ఎక్కువగా టిక్కెట్లు బుక్ చేయడం వల్ల నిజంగా/అత్యవసరంగా ప్రయాణించాల్సిన ప్రయాణీకులకు టిక్కెట్లు దొరకడం కష్టమవుతోంది.
ఈ సమస్యలను ఆపడానికి రైల్వే బోర్డు OTP విధానాన్ని ఆమోదించింది. టికెట్ బుకింగ్ యాక్టివ్, వెరిఫైడ్ ఫోన్ నంబర్‌కు అనుసంధానం చేయడం ద్వారా నకిలీ వ్యక్తులను అడ్డుకోవచ్చని రైల్వే చెబుతుంది.
అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మీ రిజిస్టర్డ్ నంబర్ పనిచేసేల, మీ దగ్గర ఉండేలా చూసుకోవాలి. వేరొకరి నంబర్‌ను ఎంటర్ చేయకండి. ఒకసారి OTP పంపిన తర్వాత బుకింగ్ కోసం మొబైల్ నంబర్‌ను మార్చడం కుదరదు. ఈ కొత్త సిస్టం తత్కాల్ టికెట్ బుకింగ్లో అవకతవకలు లేకుండా చేస్తుందని, చివరి నిమిషంలో ప్రయాణించే నిజమైన ప్రయాణీకులకు మేలు చేస్తుందని భారతీయ రైల్వే తెలిపాయి.
