- ప్రమాదాల నుంచి జంతువులను రక్షించేందుకు రైల్వే నిర్ణయం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రైల్వే ట్రాక్ లపై ఏఐ ఆధారిత కెమెరాలను బిగించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. అటవీ జంతువులను రక్షించడానికి ఇండియన్ రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏఐ కెమెరాలను ట్రాక్లపై అమరిస్తే లోకో పైలట్లకు ముందుగానే సమాచారం అందుతుంది. ట్రాక్ పై జంతువు ఉంటే ఆ రూట్ లో వస్తున్న లోక్ పైలట్ కు 0.5కిలోమీటర్ల దూరంలోనే ఉండగానే తెలిసిపోతుంది. వీటి ఏర్పాటుతో ప్రమాదాల నుంచి జంతువులను రక్షించవచ్చు. భారతీయ రైల్వే ఇటీవల ఆర్టిఫిషీయల్ఇంటెలిజెన్స్ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్)ను అభివృద్ధి చేసింది.
రైల్వేట్రాక్‌లపై ఎనుగులను పసిగట్టడానికి దీనిని వినియోగిస్తున్నది. ఐడీఎస్విధానాన్ని ప్రయోగాత్మకంగా నార్త్ఈస్ట్ఫ్రాంటియర్ రైల్వే సెక్షన్లో141 కి.మీ. పరిధిలో అమలు చేయగా విజయవంతమైంది. దీంతో భారతీయ రైల్వే తమ పరిధిలోని మరో 981 కి.మీ. మేర ఏఐ ఆధారిత కెమెరాలను అమర్చనున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా 1,122 కి.మీ. పరిధిలో ఈ విధానం అమలులో వస్తుందని చెప్పారు.
