- వెల్లడించిన సీసీఏ రిపోర్ట్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా 2019 తరువాత విపరీతంగా దెబ్బతిన్న చిన్న సంస్థలు, 2025లో బలమైన వృద్ధి సాధించాయని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది. సర్టిఫైడ్ ప్రాక్టీసింగ్ అకౌంటెంట్ (సీసీఏ ఆస్ట్రేలియా) నివేదిక ప్రకారం..సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) గత ఏడాది 80 శాతం వృద్ధి చెందాయి.
ఈ ఏడాది వృద్ధిపై ఎంతో నమ్మకంతో ఉన్నాయి. ఇది ఆసియా పసిఫిక్ సగటు 63 శాతం కంటే ఎక్కువ. 2026లో 87 శాతం వ్యాపారాలు వృద్ధిని ఆశిస్తున్నాయి. టెక్నాలజీ వినియోగం, ఉత్పత్తి పెరుగుదల వృద్ధికి కారణమయ్యాయి.
ముడి సరుకుల ధరలు పెరగడం సవాలుగా మారింది. 42 శాతం సంస్థలు అధిక ఖర్చులను పెద్ద సమస్యగా పేర్కొన్నాయి. వ్యాపారాల కోసం నిధుల అవసరం పెరిగింది. 80 శాతం సంస్థలకు విదేశీ నిధులు అవసరమయ్యాయి. గతంలో ఇది 72 శాతంగా ఉండేది.
ఆర్థిక సహాయం పొందడం సులభమైందని 53 శాతం మంది తెలిపారు. తయారీ, ఎగుమతి రంగాల వ్యాపారాలు రవాణా ఖర్చులు, ఇంధన ధరల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సరైన ప్రణాళిక, ఖర్చుల అదుపు భవిష్యత్తు వృద్ధికి అవసరమని రిపోర్ట్ సూచించింది.
