హైదరాబాద్, వెలుగు: నటి మంచు లక్ష్మి ఆతిథ్యంలో హైదరాబాద్‌లో సోమవారం హౌస్ ఆఫ్ రోజ్ జ్యుయలరీ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి నగరంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఆభరణాల సేకర్తలు హాజరయ్యారు. అతిథులందరికీ వ్యక్తిగత అపాయింట్‌మెంట్ల ద్వారా ప్రత్యేక అనుభూతి కల్పించారు. అరుదైన రంగురాళ్లు, సహజ వజ్రాలు, ప్రత్యేక డిజైన్లతో రూపొందించిన ఆభరణాలను ప్రదర్శించారు.
