ఎన్‌‌టీపీసీతో ఎవ్రెన్ జోడీ..750 మెగావాట్ల కరెంటు కొనుగోలు

ఎన్‌‌టీపీసీతో ఎవ్రెన్ జోడీ..750 మెగావాట్ల కరెంటు కొనుగోలు

హైదరాబాద్​, వెలుగు: రెన్యువబుల్ ఎనర్జీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ ఎవ్రెన్, ఎన్టీపీసీతో 750 మెగావాట్ల కరెంటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది.  ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్​లోని సోలార్, విండ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి ఇది సరఫరా అవుతుంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెన్యువబుల్ ఎనర్జీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లలో ఎవ్రెన్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కంపెనీకి మొత్తం 11 గిగావాట్ల పైప్‌‌‌‌‌‌‌‌లైన్ పో‌‌‌‌‌‌‌‌ర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో ఉంది. దీనిలో 3.5 గిగావాట్లకు పైగా ప్రాజెక్టులు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఏటా సుమారు 2.5 బిలియన్ యూనిట్ల స్వచ్ఛమైన ఎలక్ట్రిక్​ ఉత్పత్తి జరుగుతుందని ఎవ్రెన్​ తెలిపింది.