మాస్కో: ‘ఏఐ కిడ్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన కేరళ కుర్రాడు రౌల్ జాన్ అజు (17) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం మాస్కోలో ప్రారంభమైన ‘ఏఐ జర్నీ 2026’ సదస్సులో ప్లీనరీ తర్వాత పుతిన్, కజకిస్తాన్ అధ్యక్షుడు టోకాయేవ్‌ను కలిసిన యువ ప్రతిభావంతుల్లో రౌల్ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఈ సందర్భంగా రౌల్ మాట్లాడుతూ 17 ఏళ్లకే పుతిన్‌ను కలుస్తానని కలలో కూడా ఊహించలేదని, ఈ అవకాశాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపాడు. తొమ్మిదేళ్లకే ఏఐ నేర్చుకున్న రౌల్.. ‘ఏఐ రియల్మ్ టెక్నాలజీస్’ స్టార్టప్‌ను ప్రారంభించాడు.
ఇందులో 15 మంది పనిచేస్తుండగా, ఐదు లక్షల మంది విద్యార్థులకు ఏఐ శిక్షణ ఇచ్చాడు. తన కంపెనీలో పనిచేస్తున్న తండ్రికి నెలకు రూ.2 లక్షల జీతం ఇస్తున్నాడు. తండ్రి ప్రోత్సాహంతోనే ఏఐ నేర్చుకుని ‘మీబాట్’ రోబోను తయారు చేసినట్లు వెల్లడించాడు. ఈ సదస్సులో భారత్, రష్యా, చైనా సహా పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
