వెలుగు స్పెషల్ : అకాలీదళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-బీజేపీ పొత్తు పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమీకరణలు మారేనా?

వెలుగు స్పెషల్ : అకాలీదళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-బీజేపీ పొత్తు   పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమీకరణలు మారేనా?

యుద్ధం అయినా, రాజకీయాలు అయినా  ప్రత్యర్థిని ఆశ్చర్యపరచడం ఒక శక్తిమంతమైన ఆయుధం. 2,500 ఏళ్ల క్రితమే ఒక గొప్ప చైనీస్ యుద్ధ వ్యూహకర్త ఒకరు ‘తూర్పున శబ్దం చేసి, పడమర వైపు దాడి చేయండి’ అన్నారు.  అంటే  ప్రత్యర్థి దృష్టిని మళ్లించి, వారు ఊహించని చోట  దాడి చేయడం అనేది ఒక ప్రాచీన చైనీస్ యుద్ధ వ్యూహం.  

పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బీజేపీ,  అకాలీదళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తాజాగా  పొత్తును ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి, కేజ్రీవాల్  నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)కి పెద్ద షాక్ ఇచ్చాయి. ఈ పరిణామం పంజాబ్ ఎన్నికల రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది.  బీజేపీ, అకాలీదళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 1997 నుంచి 2020 వరకు అంటే సుమారు 24 ఏళ్లపాటు మిత్రపక్షాలుగా ఉన్నాయి.  అనంతరం 2022  పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో,  2024 పార్లమెంటరీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీచేశాయి.  

ఆ ఎన్నికల్లో రెండు పార్టీలు ఊహించనివిధంగా ఘోర పరాజయాన్ని చవిచూశాయి. మరోవైపు 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రదర్శన చేయగా, 2022లో  కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 

2017లో జరిగిన పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.  మొత్తం 117 స్థానాలకుగాను 77 స్థానాలను గెలుచుకుని, 38.5 శాతం ఓట్లను పొందింది.  పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారాన్ని దక్కించుకోవడానికి అదే ఎన్నికల్లో  మొదటిసారిగా గట్టి ప్రయత్నం చేసిన ఆప్ 23.72 శాతం ఓట్లతో 20 స్థానాలను గెలుచుకుంది.  

అకాలీ దళ్-– బీజేపీ కూటమి 30 శాతం ఓట్లతో  కేవలం 18 స్థానాలకు పరిమితమైంది.  ఇక 2022 ఎన్నికల్లో ఆప్ 42.01 శాతం ఓట్లతో  ఏకంగా 92 స్థానాలను కైవసం చేసుకుని అద్భుత విజయాన్ని నమోదు చేసి అధికారాన్ని కైవసం చేసుకుంది.  కాంగ్రెస్ పార్టీ కేవలం  ఆప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కోలేక 18 స్థానాలకే  పడిపోయింది.  

బీజేపీ, అకాలీదళ్ విడివిడిగా పోటీచేసినా  ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాయి. 18.38 శాతం ఓట్లతో కేవలం అకాలీదళ్ మూడు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. మరోవైపు బీజేపీ 6.60 శాతం ఓట్లతో రెండు స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది.

2024 పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన నాలుగు పార్టీలు

2024 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో  నాలుగు ప్రధాన పార్టీలైన  ఆప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ, అకాలీదళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడివిడిగా పోటీ చేశాయి.  కాంగ్రెస్ 26.31 శాతం ఓట్లతో  ఏడు స్థానాలను, ఆమ్ ఆద్మీ పార్టీ 26.03 శాతం ఓట్లతో మూడు స్థానాలను గెలుచుకున్నాయి.  అదేవిధంగా అకాలీదళ్ 13.41 శాతం ఓట్లతో ఒక స్థానాన్ని గెలుచుకున్నది. ఇక బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయినప్పటికీ 18.56 శాతం ఓట్లను సాధించగలిగింది.  ఒకవేళ బీజేపీ, అకాలీదళ్ కలిసి పోటీచేసి ఉంటే అవి విజయం సాధించే అవకాశం ఉండేది!

నాలుగు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఏమవుతుంది?

2022 అసెంబ్లీ ఎన్నికలు,  2024 పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. ఈ నాలుగు పార్టీలు విడివిడిగా  పోటీ చేసినప్పుడు, ఆమ్ ఆద్మీ పార్టీ  కచ్చితంగా అధికారాన్ని దక్కించుకునే స్థితిలో ఉంది. 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్,  ఆప్  కలిసి సుమారు 52.34 శాతం ఓట్లను సాధించాయి, కానీ అవి విడివిడిగా పోటీచేశాయి.  ఆ ఎన్నికల్లో  బీజేపీ 18.56 శాతం ఓట్లను, అకాలీదళ్ 13.41 శాతం ఓట్లను పొందాయి. 

 కాంగ్రెస్,  ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నికలు నాలుగు పార్టీల మధ్య హోరాహోరీగా ఉంటాయని భావించాయి. అంతేకాకుండా తీవ్రవాద భావజాలం కలిగిన స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం కూడా ఉంటుందని అంచనా వేశాయి.  కానీ, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటర్లు ఆప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపే మొగ్గు చూపారు.  అయితే  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 'ఇండియా'  కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఇరు పార్టీలు ఎప్పుడూ పొత్తు గురించి ఆలోచించలేదు. రాజకీయాల్లో ఇది తెలివైన రాజకీయ వ్యూహం కాదు.

బీజేపీ, అకాలీదళ్ కలిసి పోటీచేస్తే ఏమవుతుంది?

త్వరలో జరగబోయే పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన అతి ముఖ్యమైన పరిణామం ఏమిటంటే.. ఈసారి  బీజేపీ, అకాలీదళ్ మళ్లీ కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం. ఈ రెండు పార్టీలు 1997 నుంచి సుదీర్ఘకాలం మిత్రపక్షాలుగా ఉన్నాయి.  

అయితే 2020లో ఈ రెండు పార్టీలు విడిపోయాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, అకాలీదళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొత్తు ప్రకటన ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఆశ్చర్యానికి  గురిచేసింది. వాస్తవానికి అకాలీదళ్,  బీజేపీల  కలయిక విజయాన్ని ఖాయం చేస్తుందని చెప్పలేం.  కానీ ఈ పొత్తు  పంజాబ్ రాజకీయాల్లో  ఒక  ప్రకంపన మాత్రం సృష్టించింది. 

ఇప్పుడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఏం చేయగలవు?

రాజకీయాల్లో ఎలాంటి పొత్తు అయినా సాధ్యమే.  ఇప్పటికే  బీజేపీ, కాంగ్రెస్  రెండూ తాము ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోగలమని నిరూపించుకున్నాయి. 2004లో  కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో డీఎంకేతో  పొత్తు పెట్టుకుంది.  బీజేపీ జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకుని ఆమెను  జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిని  చేసింది.  

2024 ఢిల్లీ పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పొత్తు కుదుర్చుకుని భాగస్వాములుగా ఉన్నాయి. అయితే  2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసికట్టుగా ఉంటాయో లేదో చూడాలి.  ఒకవేళ ఆప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసి పోటీచేస్తే వారికి గెలిచే మంచి అవకాశం ఉంది.  అలాకాకుండా విడివిడిగా  పోటీ చేస్తే  కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు గెలుపు గ్యారంటీ ఉండదు.

కేజ్రీవాల్ ఆశ

2022 అసెంబ్లీ ఎన్నికలలో 42% ఓట్లు గెలుచుకున్నందున పంజాబ్ ఓటర్లు ఈ అసెంబ్లీ ఎన్నికలలో తమకు అనుకూలంగా ఉంటారని కేజ్రీవాల్ సారథ్యంలోని  ఆమ్ ఆద్మీ పార్టీ ఆశిస్తోంది.  అయితే 2024 నాటికి అది  24%కి పడిపోయింది.  కానీ ఈసారి జరిగేవి రాష్ట్ర ఎన్నికలు కాబట్టి పంజాబ్ ఓటర్లు తమ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తారని కేజ్రీవాల్ ఆశిస్తున్నారు.  

ఈ నేపథ్యంలో పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో  కేజ్రీవాల్ పార్టీ.. ప్రభుత్వ వ్యతిరేకత,  బలమైన  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు  పుంజుకుంటున్న బీజేపీ–-అకాలీ కూటమిని కూడా ఎదుర్కోవలసి ఉంది.  117 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న ఒక చిన్న రాష్ట్రంలో  కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇది అంత సులభమైన పని కాదు.  ఒకవేళ కేజ్రీవాల్ ఓటమిపాలైతే 2012 నుండి భారత రాజకీయాలలో ఆయన సాధిస్తున్న అద్భుతమైన ప్రస్థానా నికి ముగింపు పలికినట్లు అవుతుంది.  ఆప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటమిపాలై కాంగ్రెస్  లేదా బీజేపీ కూటమి గెలిస్తే  దాని ప్రభావం జాతీయస్థాయిలో ఉంటుంది.  

అంచనాకు అందని పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజకీయాలు 

ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే.. పంజాబ్  ఎప్పుడూ  ఊహించేవిధంగా రాజకీయ లెక్కలను అనుసరించలేదు.  భారతదేశంలో అత్యంత అనూహ్యమైన ఎన్నికల రాష్ట్రాలలో పంజాబ్ ఒకటి. 2017లో కాంగ్రెస్ అఖండ విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చింది.

 2022లో  అదే ఓటర్లు  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  రాజకీయ రంగం నుండి దాదాపుగా తొలగించి.. మొత్తం 117 స్థానాలకుగాను 92 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి అపూర్వమైన మెజారిటీని అందించారు. అదేవిధంగా 2024 పార్లమెంటరీ ఎన్నికలు మరో ఆశ్చర్యాన్ని కలిగించాయి.  అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  సహా ఇద్దరు స్వతంత్రులు పార్లమెంటరీ నియోజకవర్గాలను గెలుచుకున్నారు. 

ఈ క్రమంలో  కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పొత్తు పెట్టుకుని బీజేపీని నిలువరించగలవా లేదా అనే విషయాన్ని 2027 పంజాబ్ ఎన్నికలు పరీక్షించనున్నాయి. యాదృచ్ఛికంగా 2022లో  కాంగ్రెస్  ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేసి దళిత కార్డును ప్రయోగించడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమైంది.   

- డా. పెంటపాటి పుల్లారావు ,పొలిటికల్ ఎనలిస్ట్​-


గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.