
గ్రేటర్ నోయిడా: ఇండియా యంగ్ లిఫ్టర్లు సిద్దాంత గొగోయ్, జ్ఞానేశ్వరి యాదవ్, కోయెల్ బార్.. ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మెడల్స్‌తో మెరిశారు. ఆదివారం జరిగిన జూనియర్ మెన్స్ 61 కేజీల్లో సిద్దాంత 265 కేజీల (స్నాచ్ 116+ క్లీన్ అండ్ జర్క్ 149) బరువెత్తి టాప్ ప్లేస్‌తో గోల్డ్ సొంతం చేసుకున్నాడు. విమెన్స్ 49 కేజీ ఫైనల్లో జ్ఞానేశ్వరి 175 (స్నాచ్ 78+ క్లీన్ అండ్ జర్క్ 97) కేజీలు ఎత్తి రెండో ప్లేస్‌తో సిల్వర్ నెగ్గింది. మొత్తం పోటీల్లో ఇండియన్ లిఫ్టర్ స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ సెక్షన్‌లో ఒక్కోసారి ఫెయిలైంది. యూత్ కేటగిరీలో కోయెల్ 155 (స్నాచ్ 69+ క్లీన్ అండ్ జర్క్ 86) కేజీలతో రెండో స్థానంతో సిల్వర్ నెగ్గింది. జోడీ పెరాల్టా (160 కేజీ), ఫణిండా డెండువాంగ్ (151 కేజీ) వరుసగా గోల్డ్, బ్రాంజ్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు.