
కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్–II(ఏసీఐఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 10.
పోస్టుల సంఖ్య: 3717(అన్ రిజర్వ్డ్ 1537, ఈడబ్ల్యూఎస్ 442, ఓబీసీ 946, ఎస్సీ 566, ఎస్టీ 226)
పోస్టులు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II(ఏసీఐఓ) / ఎగ్జిక్యూటివ్
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్పై పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ప్రతిభావంతమైన క్రీడాకారులకు ఐదేండ్లు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది. వితంతులు, విడాకులు పొందిన మహిళలు, అవివాహిత మహిళలకు అన్ రిజర్వ్డ్ అయితే 35 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 40 ఏండ్ల వరకు, డిపార్ట్మెంటల్ అభ్యర్థులు 40 ఏండ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జులై 19.
లాస్ట్ డేట్: ఆగస్టు 10.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.650. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.550.
సెలెక్షన్ ప్రాసెస్: స్టేజ్–1లో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, స్టేజ్–2లో డిస్క్రిప్టివ్ టెస్ట్, స్టేజ్ –3లో ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.mha.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఐబీ ఏఐసీఓ–2025 ఎగ్జామ్ రెండు భాగాలుగా ఉంటుంది. టైర్–1లో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక గంటలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు.
టైర్–1 ఎగ్జామ్ సిలబస్
టైర్–1 ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు, జనరల్ స్టడీస్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు, రీజనింగ్ అండ్ లాజికల్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు 20 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులకు మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. టైర్-2కు అర్హత సాధించాలంటే కనీస అర్హత మార్కులు 35(అన్ రిజర్వ్డ్ -), 34(ఓబీసీ-), -33 (ఎస్సీ/ ఎస్టీ). ఈడబ్ల్యూఎస్- 35 మార్కులు సాధించాల్సి ఉంటుంది.
టైర్–2 ఎగ్జామ్
స్టేజ్–2లో ఎస్సే రైటింగ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, ప్రెసిస్ రైటింగ్ ఉంటుంది. ఎస్సే రైటింగ్ 30 మార్కులకు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ప్రెసిస్ రైటింగ్ 20 మార్కులకు మొత్తం 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. టైర్–1, టైర్–2లో అభ్యర్థులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.