
- ఐఎన్టీయూసీ లీడర్ నరేందర్
కోల్‌బెల్ట్, వెలుగు: శ్రమశక్తి అవార్డు రావడం సంతోషంగా ఉందని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మందమర్రి ఏరియా కేకే-–5 గని అసిస్టెంట్చైన్మ్యాన్ రాంశెట్టి నరేందర్ అన్నారు. అవార్డు తన బాధ్యతను పెంచిందని తెలిపారు. శుక్రవారం మందమర్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మే డేను పురస్కరించుకొని రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల చేతులమీదుగా అవార్డు అందుకోవడం ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు.
ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ నేత బి.జనక్‌ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల హక్కులు, డిమాండ్ల సాధన కోసం పని చేస్తానన్నారు. సంఘం కేంద్ర కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్కాంపెల్లి సమ్మయ్య, ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య, కేంద్ర కార్యదర్శి జగన్నాథచారి, సెక్రటరీ దొరిశెట్టి చంద్రశేఖర్ తదితరులు నరేందర్‌ను అభినందించారు.