బెంగళూరుకు ఎదురుదెబ్బ..ఓపెనర్ కోహ్లి (5) ఔట్

బెంగళూరుకు ఎదురుదెబ్బ..ఓపెనర్ కోహ్లి (5) ఔట్

అబుదాబి: ఐపీఎల్ టీ20లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో ఓవర్ లోనే తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాటపట్టారు. మ్యాచ్ రెండో ఓవర్ లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 4వ బంతికి కోహ్లి వికెట్ల ముందు దొరికిపోయాడు. కేవలం 10 పరుగుల వద్ద బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తొలి వికెట్ సమర్పించుకుంది. కెప్టెన్ కోహ్లి అమూల్యమైన వికెట్ ను దక్కించుకున్న ఆనందంతో కోల్ కతా నైట్ రైడర్స్ పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి
అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ టీ20 లీగ్ మ్యాచులో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ కోహ్లి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో బౌలింగ్ చేపట్టిన కోల్ కతా.. రెండో ఓవర్లోనే బెంగళూరును భారీ దెబ్బకొట్టింది. కెప్టెన్ కోహ్లి వికెట్ దక్కడంతో మ్యాచ్ పై ఆధిపత్యం చెలాయించేందుకు బౌలర్లతో దాడి చేపట్టింది. ఐపీఎల్ లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 27 మ్యాచులు జరుగగా.. కోల్ కతా 14 మ్యాచుల్లో గెలువగా, బెంగళూరు 13 మ్యాచుల్లో గెలిచింది. కీలకమైన ఈ మ్యాచులో గెలవడం ద్వారా కోల్ కతా తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. 
బెంగళూరు జట్టు:
కోహ్లి(కెప్టెన్), దేవ్ దత్ పడిక్కల్, కేఎస్ భరత్, ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్ వెల్, వనిందు హసరంగ, కైల్ జెబీసన్, మహమ్మద్ సిరాజ్, జెబీసన్, యుజువేంద్ర, సచిన్ బేబి.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు: 
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, శుభమన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ, సునీల్ నరైన్, దినేష్ కార్తిక్ (వికెట్ కీపర్), ఆండ్రూ రస్సెల్, లాకీ ఫెర్గూసన్.