V6 News

కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే కొనసాగించాలి: బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే కొనసాగించాలి: బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీ విషయంలో టీమిండియా మాజీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరిగి వచ్చినా.. నాయకత్వ బాధ్యతలు ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే అప్పగించాలని బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించాడు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని కొనియాడాడు. ‘బౌలర్లను ప్రయోగించడంలో ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయి. 

ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను దృష్టిలో పెట్టుకుని బౌలర్లను మార్చడంలో అతనికి మంచి పట్టు ఉంది. అదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి ఆందోళన లేకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పిన్నర్లను సమర్థవంతంగా వినియోగించుకున్న తీరు ఆకట్టుకుంది’ అని బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. జట్టులో స్థిరత్వం కోసం ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీని కొనసాగించడమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. ఇక కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కూడా బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందేహాలు వ్యక్తం చేశాడు. సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిలకడగా ఉంటుందని అంచనా వేయలేమన్నాడు.