ఇరాన్​లో రేప్​ కేసుల్లో ముగ్గురికి ఉరి

ఇరాన్​లో రేప్​ కేసుల్లో ముగ్గురికి ఉరి

టెహ్రాన్: ఇరాన్​లో మహిళలపై అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలిన ముగ్గురికి మంగళవారం ఉరిశిక్ష విధించారు. కాస్మోటిక్​ సర్జరీ క్లినిక్​గా నమ్మించి మహిళలను మోసం చేసేవారని, క్లినిక్​కు వచ్చిన మహిళలకు మత్తు ఇంజెక్షన్​ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడినట్లు స్థానిక మీడియా తెలిపింది. 2021లో వారు 12  లైంగిక దాడుల కేసుల్లో దోషులుగా తేలినట్లు న్యాయశాఖకు చెందిన మిజాన్​ ఆన్​లైన్​ వెబ్ సైట్​ నివేదించింది. అనధికారిక బ్యూటీ సెలూన్​లో చాలామంది మహిళలను రేప్​చేసిన ముగ్గురు వ్యక్తులకు ఉరిశిక్ష అమలుచేసినట్లు హర్మోజ్​గాన్​ చీఫ్​జస్టిస్​మోజ్తాబా తెలిపినట్లు వెబ్​సైట్ నివేదించింది. 

కాగా, ముగ్గురిలో  ఒకరైన మెడికల్​అసిస్టెంట్​అబద్ధపు ప్రకటనలతో ఏడుగురు మహిళలను మోసగించాడని, ఫేక్​ క్లినిక్​కు వచ్చిన బాధిత మహిళలకు మత్తు ఇంజెక్షన్​ ఇచ్చి అనంతరం వారిని రేప్​ చేసేవాడని నివేదికలో పేర్కొన్నారు. మిగిలిన ఇద్దరు నర్సులు..వీరు ఐదు రేప్ కేసులతోపాటు డ్రగ్స్ దొంగతనం ఆరోపణల్లోనూ దోషులుగా నిర్ధారణ అవడంతో ఉరిశిక్ష అమలు చేసినట్లు నివేదించారు. కాగా, ఇరాన్​గతేడాది పలు కేసుల్లో 582మందికి ఉరిశిక్ష అమలు చేసినట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్​హ్యూమన్​ రైట్స్ గ్రూప్​తెలిపింది.