Vastu Tips: ఇంట్లో ఇనుప వస్తువులు ఎక్కడ ఉండాలి.. మెట్లకింద పూజ గది ఉంటే ఇబ్బందులు వస్తాయా..!

Vastu Tips:  ఇంట్లో ఇనుప వస్తువులు ఎక్కడ ఉండాలి.. మెట్లకింద పూజ గది ఉంటే ఇబ్బందులు వస్తాయా..!

 

వాస్తు ప్రకారం  ఇంట్లో ఎలక్ట్రానిక్​ వస్తువుల ఎక్కడ ఉండాలి..  ఏ దిక్కులో బరువైన వస్తువులు పెట్టుకో వాలి.పూజ గది మెట్లకింద ఉంటే వచ్చే ఇబ్బందులు ఏమిటి.. ఈవిషయాల గురించి  వాస్తు కన్సల్టెంట్​ శ్రీనివాస్​సూచనలను ఒకసారి పరిశీలిద్దాం. . . 

ప్రశ్న:  మాకు ఐరన్ అండ్ స్టీల్ షాపు ఉంది. అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని వస్తువులను భద్రపరుస్తాం. బరువైన ఇనుము వస్తువులు ఇంట్లో ఉండొచ్చా? ఏ దిక్కులో పెట్టుకోవాలి? బరువైన వస్తువులను పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయా?

జవాబు:  దక్షిణం, పడమర వైపు మాత్రమే బరువు వస్తువులు ఉండాలి. ఉత్తర, ఈశాన్యం వైపు బరువు ఉండకూడదు. దానివల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. మానసిక సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి ఇనుప వస్తువులను ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కాకుండా ఉత్తర, ఈశాన్యం వైపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తుకన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ చెబుతున్నారు. 

ప్రశ్న:  మాది డూప్లెక్స్ హౌజ్. మెట్ల కిందనే పూజ గది ఉంది. మా బంధువులు మెట్ల కింద పూజ గది ఉండొద్దు అంటున్నారు. ఏం చేయాలి?

జవాబు: మెట్ల కింద పూజ గది ఉంచటం మంచిది కాదు. దేవుడి పైనుంచి నడవకూడదు. కాబట్టి దేవుడి గది మార్చుకోవాలి. అయితే ఆ స్థానంలో దేవుడి గదికి బదులు స్టోర్ రూమ్ ఉండేలా చూసుకోండని వాస్తుకన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ సూచిస్తున్నారు.  .