
- స్పాట్ లో చనిపోయిన ఉద్యోగి
- ఖమ్మం జిల్లాలో ప్రమాదం
కూసుమంచి, వెలుగు: బైక్ ను ఆర్టీసీబస్సు ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఖమ్మంకు మధిర ఆర్టీసీ డిపో బస్సు వెళ్తుంది. గురువారం సాయంత్రం కూసుమంచి మండలం పాలేరు పెద్ద కాల్వ వద్ద బైక్ పై వెళ్లే బండ్ల హుస్సేన్(58)ను బస్సు స్పీడ్ గా వెళ్లి ఢీకొట్టింది.
బస్సు ముందు భాగంలో బైక్ తో పాటు అతను ఇరుక్కుపోగా, 50 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో హుస్సేన్ స్పాట్ లోనే చనిపోయాడు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం108లో ఆస్పత్రికి తరలించారు. ఇరిగేషన్‌శాఖలో వర్క్ఇన్ స్పెక్టర్ అయిన హుస్సేన్ డ్యూటీ ముగిసిన తర్వాత సొంతూరు సూర్యాపేట జిల్లా చిలుకూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.