
ఇజ్రాయెల్ ప్రతినిధి డెన్నీ డానన్ ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాక్ భూమిపై ఒసామా బిన్ లాడెన్ చంపబడిన విషయాన్ని మళ్లీ గుర్తుచేస్తూ పాకిస్తాన్‌పై విమర్శలు చేశారు. బిన్ లాడెన్ పాక్ ప్రాంతంలోనే హతమయ్యాడని.. ఈ సంఘటన వాస్తవాన్ని మార్చలేదని ఆయన స్పష్టం చేసారు. అసలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఎందుకు కల్పిస్తున్నారనే ప్రశ్నను ఎవ్వరూ అడగటం లేదెందుకని ఇజ్రాయెల్ ప్రతినిధి అన్నారు. బిన్ లాడెన్ విషయంలో జరిగిందే ప్రస్తుతం ఇప్పుడు హమాస్ విషయంలోనూ జరుగుతోందని డెన్నీ క్లారిఫై చేశారు.
ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడి గురించి చర్చించడానికి జరిగిన భద్రతా మండలి సమావేశంలో ఇజ్రాయెల్ పాకిస్తాన్ రాయబారుల మధ్య ఈ వాగ్వాదం జరిగింది. ఖతార్‌పై ఇజ్రాయెల్ చట్ట విరుద్దంగా, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, ఇది ప్రాంతీయంగా శాంతిని దెబ్బతీస్తోందని పాక్ రాయబారి అన్నారు. గాజాలో "క్రూరమైన" సైనిక చర్యలతో సిరియా, లెబనాన్, ఇరాన్, యెమెన్‌లలో పదేపదే సరిహద్దు దాడుల ద్వారా ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పాక్ ఆరోపించింది.
ఇజ్రాయెల్ తన దేశాన్ని రక్షించుకోవడాన్ని, హమాస్ ఉగ్రమూఖలను అంతం చేయటాన్ని ప్రపంచం అంగీకరించాల్సిన అవసరం ఉందని, హమాస్‌కు శరణు ఇవ్వడం అంగీకించలేనిదని ఇజ్రాయెల్ ప్రతినిధి చెప్పారు. గతంలో ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా వంటి దేశాలు తమ సరిహద్దుల్లో అనేక సార్లు ఉగ్రవాదులపై దాడులు చేయడం సాధారణమని, ఇజ్రాయెల్‌పై మాత్రమే రాజ్యాంగ పరిరక్షణ దాడుల గురించి ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయో చెప్పాలని కోరింది ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్ పోరాటం ప్రాధాన్యంగా ప్రజాస్వామ్య, న్యాయం, శాంతి వంటి విలువల కోసం చేస్తున్న పోరాటమని, హింసను అడ్డుకోవాలన్న ప్రపంచ సమాజం కట్టుబడి ఉండాలని అన్నారు.