- కచ్చితత్వం, సమయస్పూర్తి లేకుంటే ప్రమాదాలే: ఇస్రో చైర్మన్ నారాయణన్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఇండియన్ రైల్వే, ఇండియన్స్పేస్రీసెర్చ్ఆర్గనైజేషన్(ఇస్రో) మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని ఇస్రో చైర్మన్ డా. వి.నారాయణన్అన్నారు.రెండింటినీ కచ్చితత్వంతో, సమయస్పూర్తితో నడపకపోతే పరిణామాలు భయంకరంగా ఉంటాయనిని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని మెట్టుగూడలో ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఇరిసెట్) 68వ వార్షికోత్సవం జరిగింది. దీనికి నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.
" రోజూ లక్షలాది మంది రైళ్లు ఎక్కుతారు. ఒక్క సిగ్నల్ తప్పినా, ఒక్క సెకను ఆలస్యమైనా.. రెండు రైళ్లు ఢీ కొట్టుకుని వందల మంది చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే రైల్వే సిగ్నల్ ఇంజినీర్, డ్రైవర్, స్టేషన్ మాస్టర్ అందరూ ప్రతి సెకను 100% అప్రమత్తంగా ఉండాలి. అలాగే..ఇస్లో ఒక్క రాకెట్ పంపితే కూయ 500–1000 కోట్లు ఖర్చవుతుంది. పైగా దేశం మొత్తం చూస్తూ ఉంటుంది.లాంచ్‌లో ఒక్క సెకను ముందు లేదా వెనక్కి అయినా రాకెట్ పేలిపోవచ్చు. ఒక్క మిల్లీమీటరు కక్ష్య తప్పి నా శాటిలైట్ లక్ష్యం చేరుకోదు. ఈ రెండు సంస్థల విజయానికి మూలం పటిష్ఠమైన కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థ.చంద్రుడి సౌత్ పోల్‌పై ల్యాండ్ అవడం ఇస్రో ఘనత అయితే..రోజూ రైళ్లను సురక్షితంగా నడపడం రైల్వే ఘనత.
ఈ రెండు సంస్థల మధ్య టెక్నాలజీ పంచుకోవడం, పరస్పర సహకారం ఉందని..ఇది రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుంది" అని నారాయణన్ పేర్కొన్నారు. రైల్వే బోర్డు చీఫ్ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ సతీశ్కుమార్మాట్లాడుతూ.. రైళ్ల నిర్వహణలో రక్షణ అన్నది ప్రధానమని అధికారులు, సూపర్వైజర్లలో వర్క్హాబిట్స్మరింత మెరుగ్గా ఉండాలన్నారు. దక్షిణమధ్య రైల్వే జీఎంసంజయ్కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఇండియన్ రైల్వేస్‌లో సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్‌లో ఇరిసెట్ఉత్తమ ఫలితాలు సాధిస్తోందన్నారు. రైళ్ల ఆపరేషన్లను మరింత మెరుగు పరిచేందుకు వివిధ రకాల ట్రైనింగ్ప్రోగ్రామ్స్ను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. ఇరిసెట్కోర్సుల్లో టాపర్స్ గా నిలిచిన వారిని డా.వి.నారాయణన్బహుమతులతో సత్కరించారు.
