భర్తతో గొడవ పడి ఐటీ ఎంప్లాయ్ సూసైడ్

భర్తతో గొడవ పడి ఐటీ ఎంప్లాయ్ సూసైడ్

చందానగర్, వెలుగు: భర్తతో గొడవల కారణంగా సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్​ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. మహారాష్ర్ట కొల్లాపూర్​కు చెందిన అరుణ శివాజీ పాటిల్(30)కు అదే ప్రాంతానికి చెందిన నిలేశ్​తో 2023 మార్చిలో వివాహమైంది. ఉద్యోగ నిమిత్తం 2025 జనవరిలో భార్యాభర్తలు హైదరాబాద్​కు వచ్చి నల్లగండ్లలోని అపర్ణ గేటెడ్​ కమ్యూనిటీలో నివాసముంటున్నారు. అరుణ హైటెక్​సిటీలో ఓ ఐటీ కంపెనీలో జాబ్​ చేస్తుంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఇద్దరు గొడవ పడ్డారు. భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోగా అరుణ బెడ్రూంలో చున్నీతో ఫ్యాన్​కు ఉరేసుకుంది. చందానగర్​ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

పురుగుల మందు తాగి మరొకరు..

చందానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్​ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్​ గ్రామానికి చెందిన జి.సుమన్(35) లేబర్​ పనిచేస్తుంటాడు. ఆయనకు ఐదేళ్ల క్రితం వివాహం జరగ్గా పిల్లలు పుట్టకపోవడంతో అదే గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళతో కలిసి నగరానికి వచ్చి తెల్లాపూర్​లోని ఇంద్రానగర్​లో ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి చందానగర్​ పోస్టాఫీస్​ మెట్ల వద్ద సుమన్​ పురుగుల మందు తాగి చనిపోయాడు. డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

హిమాయత్‌సాగర్‌లో దూకి యువకుడు..

గండిపేట: హిమాయత్​సాగర్‌లో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం హియాయత్ సాగర్​లో యువకుడి డెడ్​బాడీ బయటకు తెలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రాజేంద్రనగర్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడిని ముఖేష్‌ గా గుర్తించారు. డెడ్​బాడీని పోస్టుమార్టంకు తరలించి, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.