రక్తాలు పారుతాయన్న భుట్టోకి బుద్ధి వచ్చింది: ఉగ్రవాద నిర్మూలన ముందుకు రావాలని భారత్‎కు పిలుపు

రక్తాలు పారుతాయన్న భుట్టోకి బుద్ధి వచ్చింది: ఉగ్రవాద నిర్మూలన ముందుకు రావాలని భారత్‎కు పిలుపు

ఇస్లామాబాద్: భారత్‏పై నిత్యం విషం చిమ్మే పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి జ్ఞానోదమైంది. పాక్, భారత్ ఉద్రిక్తతల వేళ సింధు నదిలో నీరు పారకుంటే హిందువుల రక్తం పారుతుందంటూ రంకెలేసిన భుట్టోకి ఎట్టకేలకు బుద్ధి వచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్ మాతో కలిసి రావాలని నీతులు వల్లించాడు. శత్రుత్వాన్ని వదిలేసి భారత్ పాకిస్థాన్‎తో కలిసి నడవాలని సుద్ధపూస ముచ్చట్లు చెప్పాడు.

ఇస్లామాబాద్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం కోసం పాకిస్థాన్ పోరాటం’ అనే అంశంపై బిలావల్ భుట్టో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భారత్ ప్రస్తావన తీసుకొచ్చారు. హత్య చేసిన వాడే సంతాపం తెలిపిన చందంగా.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ప్రాంతీయ శాంతిని పెంపొందించడానికి చారిత్రాత్మక, అసాధారణ భాగస్వామ్యాన్ని నిర్మించడంలో భారత్ పాకిస్తాన్‌తో చేతులు కలపాలని వింత వ్యాఖ్యలు చేశాడు. 

►ALSO READ | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు షాక్.. కోర్టు ధిక్కారణ కేసులో 6 నెలల జైలు శిక్ష

పాక్‎తో వైరాన్ని పక్కకు పెట్టి భారత్ ముందుకు సాగాలని నీతులు వల్లించాడు. ఉగ్రవాదాన్ని సంయుక్తంగా ఎదుర్కోవడానికి భారతదేశంతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని తెలిపారు. శత్రుత్వాన్ని పక్కకు పెట్టి ఉగ్రవాద మహమ్మారి నుంచి బిలియన్ల మందిని రక్షించడానికి భారత్ ముందుకు రావాలన్నారు. భారత్ అహాన్ని పక్కకు పెట్టి చర్చలకు ముందుకు రావాలని తలతిక్క మాటలు మాట్లాడాడు. సిందు జలాల ఒప్పందం రద్దు వంటి అంశాలపై చర్చలకు రావాలన్నారు.

 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలను కోరాడు భుట్టో. ఇరు దేశాల మధ్య నెలకొన్న జల వివాదానికి ముగింపు పలకాలన్నాడు. హిమాలయాలంత శక్తివంతమైన శాంతిని నిర్మిద్దామని.. సింధు లోయ నాగరికతలో పాతుకుపోయిన ఉమ్మడి సంప్రదాయాలకు తిరిగి పునర్మిద్దామని పిలుపునిచ్చారు. చర్చలకు, శాంతిని నెలకొల్పేందుకు ముందు రావాలని కోరడం బలహీనత కాదని.. అది జ్ఞానమని అన్నారు.