
భోపాల్‌లోని గాయత్రి నగర్‌లో 29 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు గొంతు కోసి చంపిన దారుణ ఘటన ఆ నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 32 ఏళ్ల సచిన్ రాజ్‌పుత్, రితికా సేన్‌ను చంపడమే కాకుండా, ఆమె శరీరాన్ని దుప్పటిలో చుట్టి అసలు ఏం జరగనట్లు నటిస్తూనే రెండు రాత్రులు ఆమె పక్కనే పడుకున్నాడు.
అయితే గత నెల జూన్ 27న రాత్రి వీరి మధ్య తీవ్ర వాగ్వాదం తర్వాత ఈ హత్య జరిగింది. ఉద్యోగం లేకపోవడంతో మాదక ద్రవ్యాలకు, మద్యానికి బానిసైన సచిన్ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న రితికాకు ఆమె పని చేసే యజమానితో సంబంధం ఉందని అనుమానించాడు. దీంతో వీరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి కోపంతో అతను ఆమె గొంతు కోసి చంపాడు. తరువాత సచిన్.. రితికా మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి, మంచం మీద అదే గదిలోనే ఉన్నాడు. పోలీసుల ప్రకారం అతను రెండు రోజుల పాటు మృతదేహం పక్కనే పడుకున్నాడు.
గత ఆదివారం రోజున మద్యం తాగి, మనస్తాపం చెందిన సచిన్ తన స్నేహితుడు అనుజ్‌తో ఈ హత్య విషయాన్నీ చెప్పాడు. కానీ అనుజ్ మొదట అతని మాట నమ్మలేదు. కానీ మరుసటి రోజు ఉదయం సచిన్ అదే విధంగా మాట్లాడటంతో, సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అనుజ్ చివరకు పోలీసులకు ఫోన్ చేశాడు.
పోలీసులు అతను ఉంటున్న అద్దె ఇంటికి వెళ్ళి చూడగా సచిన్ వివరించినట్లుగానే రితికా మృతదేహం కుళ్ళిపోయి దుప్పటిలో చుట్టి మంచం మీద పడి ఉంది. అంతేకాదు వీరిద్దరూ మూడున్నర సంవత్సరాలుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అని పోలీసులు తెలిపారు.
►ALSO READ | 800 గ్రాముల గోల్డ్, రూ.70 లక్షల వోల్వో కార్ ఇచ్చారు.. అయినా కట్నం కోసం చంపేశారు !
పోలీసులు NDTVతో మాట్లాడుతూ "చనిపోయిన మహిళను రితికా సేన్ అని గుర్తించారు. ఆమె తన ప్రియుడు సచిన్ రాజ్‌పుత్‌తో నివసిస్తోంది, అతనికి ముందే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. జూన్ 27 రాత్రి వీరి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తీవ్రమై సచిన్ ఆమెను గొంతు కోసి చంపాడు. తరువాత మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి అదే గదిలోనే ఉన్నాడు. చివరకు తాగిన మత్తులో అతను తన స్నేహితుడికి ఈ విషయాన్నీ చెప్పగా అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సచిన్ విదిషలోని సిరోంజ్ కు చెందినవాడు. రితిక అతను దాదాపు 9 నెలల క్రితం గాయత్రి నగర్లోకి మకాం మారారు. రితిక జాబ్ చేస్తుండగా, సచిన్ నిరుద్యోగిగా ఉండేవాడు. సచిన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.