రెండో రోజూ ఐటీ సోదాలు..కీలకమైన ఫైల్స్​, హార్డ్​డిస్క్​లు స్వాధీనం

రెండో రోజూ  ఐటీ సోదాలు..కీలకమైన ఫైల్స్​, హార్డ్​డిస్క్​లు స్వాధీనం

బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధుల ఇళ్లు, ఆఫీస్ లలో ఐటీ ఆఫీసర్ల సోదాలు ఇవాళ్ల కూడా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్​రెడ్డి, ఫైళ్ల శేఖర్​రెడ్డితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి ఆఫీస్లు, ఇళ్లలో కంటిన్యూగా తనిఖీ చేస్తున్నారు.  జూన్​ 14 ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు ఆయా ప్రజాప్రతినిధుల ఇళ్లలోనే ఉన్నారు. హైదరాబాద్​, బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని 60 ప్రాంతాల్లో 400 మంది అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే కీలకమైన ఫైల్స్​, హార్డ్​డిస్క్​లు, బ్యాంక్​ లాకర్స్​ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ రాత్రి వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఐటీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా బీఆర్​ఎస్​ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. బీజేపీ కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతోందని విమర్శించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.