
బషీర్ బాగ్, వెలుగు: సీఎం కేసీఆర్‌కు రెడ్డిల భయం పట్టుకుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయిన రెడ్డీల కు మంత్రులుగా అవకాశం కల్పిస్తూ.. బీసీ ఎమ్మెల్యేలను విస్మరిస్తున్నారని జాజుల మండిపడ్డారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో సోమవారం బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు మణి మంజరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జాజుల చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రకటించిన 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో.. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు కేవలం 7 సీట్లు మాత్రమే కేటాయించారని, అందులో బీసీ మహిళకు ఒక్క సీటు ఇవ్వలేదన్నారు. 80 లక్షల మంది బీసీ మహిళా ఓటర్లున్నారని.. ఒక్క బీసీ మహిళకు సీటు కేటాయించకపోతే వాళ్లు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు.