
- యాసంగి సీజన్‌కు సంబంధించి 41,433 మెట్రిక్ టన్నులు అప్పగింత
- రైస్ ఎగ్గొట్టిన పలువురు మిల్లర్లకు నోటీసులు
- రికవరీకి ఒత్తిడి చేస్తామంటున్న అధికారులు
జనగామ, వెలుగు: కస్టమ్‌మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సేకరణపై జనగామ జిల్లా సివిల్సప్లై ఆఫీసర్లు స్పెషల్ఫోకస్పెట్టారు. సకాలంలో టార్గెట్రీచ్ అయ్యేందుకు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ఆదేశాలతో మిల్లర్ల పై ఒత్తిడి పెంచుతున్నారు. పెండింగ్ బకాయిల వసూళ్ల పైనా నజర్‌పెట్టారు.
గత యాసంగి సీజన్లో 28 శాతం..
గత వానాకాలం సీజన్‌కు సంబంధించి సీఎంఆర్సేకరణ 80 శాతం దాటింది. జిల్లాలోని 60 రైస్ మిల్లులకు 2024–-25 సీజన్ కు సంబంధించి1,36,867 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. దీనికి 91,863 మెట్రిక్ టన్నుల సీఎంఆర్రావాల్సి ఉంది. ఇప్పటివరకు మిల్లర్లు 73,683 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా 18,179 మెట్రిక్ టన్నులు ఇవ్వాలి. కాగా గడువు పెంచుతున్నా వానాకాలం సీఎంఆర్అప్పగింత పూర్తవకపోవడంపై ఇటీవల రివ్యూ మీటింగ్‌లో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా యాసంగి 2024–-25 సీజన్ కు సంబంధించి జిల్లాలోని 56 మిల్లులకు 2,14,769 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. ఇందులో జనగామ జిల్లాకు సంబంధించి 1. 85 లక్షల మెట్రిక్ టన్నులు కాగా మిగతాది సూర్యాపేట జిల్లాకు చెందినది. ఈ ధాన్యానికి సంబంధించి మొత్తం 1,45,045 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 41,433 మెట్రిక్ టన్నులు సేకరించారు. 28 శాతం టార్గెట్ రీచ్ అవగా ఇంకా 1,03,612 మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉంది.
మిల్లర్‌పై క్రిమినల్ కేసు
2022–-23 యాసంగి, 2023-–24 వానాకాలం సీజన్‌కు సంబంధించి దేవరుప్పుల మండలం మన్‌పహాడ్ సాయిరాం మోడ్రన్ బిన్నీ రైస్ మిల్యాజమాన్యం రూ.5.67 కోట్ల విలువైన సీఎంఆర్ ఇవ్వడం లేదు. దీంతో డబ్బులైనా చెల్లించాలని గతేడాది అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో క్రిమినల్కేసు నమోదు చేసి, సదరు మిల్లర్ ఆస్తుల క్రయ విక్రయాలు జరపకుండా ఆదేశాలిచ్చారు.
ఇదిలా ఉంటే రఘునాథపల్లి మండలం కంచనపల్లిలోని రైస్ మిల్లు 2023–-24 యేడాదికి సంబంధించి రూ.కోటి విలువ చేసే సీఎంఆర్ ఇవ్వకపోవడంతో గతేడాది నోటీసులు ఇచ్చారు. దీని రికవరీ కూడా నేటికీ పెండింగ్‌లోనే ఉంది. ఈ మొండి బకాయిలపై మరింత ఒత్తిడి పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.
మిల్లర్లను అలర్ట్ చేస్తున్నం
జిల్లాలో సీఎంఆర్సేకరణ వేగవంతంగా జరుగుతోంది. కలెక్టర్ ఆదేశాలతో మిల్లర్లను ఎప్పటికప్పుడు అలర్ట్చేస్తున్నం. గత వానాకాలం సీజన్ కు సంబంధించి80 శాతం దాటగా యాసంగి సీజన్28 శాతం వరకు సేకరించాం. మిగతాది త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. మొండి బకాయిలు ఉన్న మిల్లర్లపై తగిన చర్యలు చేపడుతాం. – వి.హథీరామ్ నాయక్, డీఎం, సివిల్ సప్లై, జనగామ