విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి : అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్

విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి : అడిషనల్ కలెక్టర్  పింకేశ్కుమార్
  • జనగామ అడిషనల్​ కలెక్టర్  పింకేశ్​కుమార్​

బచ్చన్నపేట, వెలుగు : విద్యార్థుల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం నివ్వాలని జనగామ అడిషనల్ కలెక్టర్, జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ పింకేశ్​ కుమార్​ టీచర్లకు సూచించారు. గురువారం బచ్చన్నపేట మండలంలోని పలు ప్రభుత్వ స్కూళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ స్కూల్​ను​ సందర్శించి నూతనంగా నిర్మిస్తున్న తరగతి గదులను పరిశీలించారు. వంటగదిని పరిశీలించి కూరగాయాలు, ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచాలన్నారు. 

విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని చెప్పారు.  బచ్చన్నపేట ప్రైమరీ స్కూల్​ను  సందర్శించారు. స్కూల్ గదుల్లో నిర్వహిస్తున్న అంగన్​వాడీ, ప్రైమరీ హెల్త్​ సెంటర్​ను వెంటనే ఖాళీ చేయించి వేరే ప్రదేశానికి మార్చాలని ఎంపీడీవో మమతాబాయిని ఆదేశించారు. పోచన్నపేట స్కూల్​లో స్టూడెంట్స్ కోసం పైలెట్ ప్రాజెక్టుగా వేసిన వాల్ పెయింటింగ్​ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరుశాతం పెంచాలని టీచర్లకు సూచించారు. ఆయన వెంట ఏఎంవో శ్రీనివాస్, జీసీడీవో గౌషియా బేగం, ఎంఈవో వెంకట్​రెడ్డి, ఇంజినీరిగ్ డిపార్ట్​మెంట్ డీఈ రవిందర్,​టీచర్లు ఉన్నారు.