పత్తి రైతులకు ఇబ్బంది కలగొద్దు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

పత్తి రైతులకు ఇబ్బంది కలగొద్దు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: పత్తి విక్రయించడానికి వచ్చే రైతులను జిన్నింగ్​ మిల్లుల యాజమాన్యం, సీసీఐ అధికారులు ఇబ్బందులకు గురి చేయొద్దని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ తెలిపారు. పత్తి కొనుగోలు పైన వ్యవసాయ, మార్కెటింగ్, జిన్నింగ్​ మిల్లుల యాజమాన్యంతో కలెక్టరేట్​లో మంగళవారం రివ్యూ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని నాణ్యత పేరిట తిరస్కరించకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. 

వ్యవసాయ అధికారులు రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అంతకుముందు పోలీస్, రెవెన్యూ, మార్కెటింగ్, సివిల్​ సప్లై శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అలర్ట్​గా ఉండాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని చెప్పారు. స్థానికంగా నిర్వహించిన యువజన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. కళా రంగాల అవకాశాలను యువత వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.