జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పంట కాల్వల నిర్మాణాల్లో వేగం పెంచాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్, మెగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కెనాల్స్ నిర్మాణానికి అవసరమైన భూములపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు.
రైతులకు న్యాయపరమైన పరిహారం అందించే ప్రక్రియ పారదర్శకంగా జరగాలని సూచించారు. రైతులతో చర్చలు జరిపి, భూసేకరణకు సంబంధించిన సమాచారం స్పష్టంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏటీసీ రమేశ్తదితరులు పాల్గొన్నారు.
