IND vs AUS: ఫిట్‌‌నెస్ ఉన్నా చివరి మూడు టీ20లకు హేజల్ వుడ్ దూరం.. అభిషేక్ శర్మ రియాక్షన్ ఇదే!

IND vs AUS: ఫిట్‌‌నెస్ ఉన్నా చివరి మూడు టీ20లకు హేజల్ వుడ్ దూరం.. అభిషేక్ శర్మ రియాక్షన్ ఇదే!

ఇండియాతో జరగనున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా చివరి మూడు మ్యాచ్ లకు ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ దూరమయ్యాడు. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20 లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేసిన ఈ ఆసీస్ పేసర్..  ఫిట్ గా ఉన్నప్పటికీ సిరీస్ లోని మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదు. పని భారం కారణంగా హేజల్ వుడ్ కు క్రికెట్ ఆస్ట్రేలియా రెస్ట్ ఇచ్చింది. త్వరలో జరగబోయే యాషెస్ సిరీస్ కోసం ఈ స్టార్ పేసర్ ను ఫ్రెష్ గా ఉంచాలని ఆసీస్ భావిస్తోంది. నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాలో యాషెస్ ప్రారంభమవుతుంది. 

ఇండియాతో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన హేజల్ వుడ్.. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో చెలరేగి బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. గిల్, సూర్య, తిలక్ వికెట్లు తీసుకొని ఇండియాను కష్టాల్లో నెట్టాడు. హేజాల్ వుడ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. శుక్రవారం (అక్టోబర్ 24) క్రికెట్ ఆస్ట్రేలియా నలుగురు కొత్త ప్లేయర్లను స్క్వాడ్ లోకి చేర్చుకుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న మ్యాక్స్ వెల్ ఆసీస్ జట్టులోకి చాలా నెలల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. యువ పేసర్ మహ్లి బియర్డ్‌మాన్ (మూడు, నాలుగు, ఐదు) స్క్వాడ్ లో ఎంపికయ్యారు.   

నాకేం తెలియదు:

రెండో టీ20లో ప్రెస్ కాన్ఫరెన్స్ తో మాట్లాడుతున్న అభిషేక్ శర్మ హేజల్ వుడ్ చివరి మూడు మ్యాచ్ లకు దూరమవుతున్నట్టు తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. హాజిల్‌వుడ్ అందుబాటులో లేడని ఆస్ట్రేలియన్ రిపోర్టర్ అభిషేక్‌కు తెలియజేయగా.. అభిషేక్ ఇలా మాట్లాడాడు. “ఓహ్, అవునా? హేజల్ వుడ్ ఆడడనే విషయం నాకు తెలియదు. అతను ఫార్మాట్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్. అయినప్పటికీ నేను అతన్ని ఛాలెంజ్ గా తీసుకుంటాను. ఎందుకంటే, ఒక బ్యాట్స్‌మన్‌గా, మీరు ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కోవాలి. నేను అదే చేస్తున్నా". అని అభిషేక్ అన్నాడు.  

ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం (నవంబర్ 2) జరుగుతుంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి తీరాల్సిందే.