నవీన్ గెలుపుతో బీసీల రాజకీయ జైత్రయాత్ర షురూ : దాసు సురేశ్

నవీన్ గెలుపుతో బీసీల రాజకీయ జైత్రయాత్ర షురూ : దాసు సురేశ్
  • జూబ్లీహిల్స్ ఓటర్లు నిజాయితీకే పట్టం కట్టారు: దాసు సురేశ్ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడాన్ని బీసీల గెలుపుగానే భావిస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. నవీన్ గెలుపు బీసీల రాజకీయ జైత్రయాత్రకు శ్రీకారమని..జూబ్లీహిల్స్ ఓటర్లు నిజాయితీకే పట్టం కట్టారని సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో బీసీ ముఖ్య నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాసు సురేశ్ మాట్లాడారు. 

సమావేశంలో స్టేట్ ఫార్మర్స్ రైట్స్ ప్రొటెక్షన్ చైర్మన్ వడ్డేపల్లి రామకృష్ణ, ఈబీసీ నాయకులు, పీసీసీ సెక్రటరీ గంటా సత్యనారాయణ రెడ్డి, ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ హన్మకొండ జిల్లా ఇన్ చార్జ్ కూర వెంకటేశ్వర్లు, ఆల్ బీసీ మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ శుక్రుద్దీన్, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగ రవి యాదవ్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.