రిచ్చెస్ట్ చిల్లర్ గయ్‌‌‌‌

రిచ్చెస్ట్ చిల్లర్ గయ్‌‌‌‌

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా  జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కె -ర్యాంప్‌‌‌‌’.  రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. శుక్రవారం టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. కేరళ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఎనర్జిటిక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా  సినిమా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. 

కుమార్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో రిచ్చెస్ట్  చిల్లర్ గయ్‌‌‌‌గా కిరణ్ అబ్బవరం చేసిన కామెడీ ఆకట్టుకుంది. ఫుల్ ఎనర్జిటిక్‌‌‌‌గా కనిపిస్తూ..  తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌‌‌‌తో ఇంప్రెస్ చేశాడు. కేరళ అమ్మాయి మెస్సీ పాత్రలో యుక్తి తరేజా కనిపించింది.  సాయి కుమార్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, శివన్నారాయణ ఇతర పాత్రలు పోషించారు.

 ‘ఇంతమంది చెప్పినా ప్రేమించావంటే నువ్వు డెఫనెట్‌‌‌‌గా డెవిల్ గిఫ్టెడ్ చైల్డ్ రా,  అరేయ్ నీకు అందరూ చెబుతున్నార్రా బిల్డప్‌‌‌‌లు ఎక్కువైనయ్ తగ్గించుకోమని, ఏం చేద్దాం, అవే చేద్దాం..’  అనే డైలాగ్స్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తున్నాయి.  

లవ్,  రొమాన్స్, యాక్షన్, ఫన్‌‌‌‌తోపాటు చేతన భరద్వాజ్ అందించిన బ్యాక్‌‌‌‌గ్రౌండ్ మ్యూజిక్  సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అక్టోబర్ 18న సినిమా  విడుదల కానుంది.