అధిక మార్కులు సాధించిన దీక్షితకు కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీ సన్మానం

అధిక మార్కులు సాధించిన దీక్షితకు కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీ  సన్మానం

ముషీరాబాద్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అత్యధికంగా మార్కులు సాధించారని మేనేజ్​మెంట్ తెలిపింది. మరింత కష్టపడి చదివి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని సూచించింది. బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దీక్షిత లహరి 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించినందుకు సోమవారం మేనేజ్​మెంట్ ఘనంగా సత్కరించి అభినందించింది.

ఈ సందర్భంగా ఇన్​స్టిట్యూషనల్ డైరెక్టర్ రిషికాంత్ మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్​ మంచి ఫలితాలు సాధించారన్నారు. ఇంత మంచి మార్క్స్ రావడానికి కాలేజ్ యాజమాన్యం, ఫ్యాకల్టీ కృషి ఎంతగానో ఉందన్నారు. స్టూడెంట్ దీక్షిత లహరి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో చదవడం అదృష్టంగా భావిస్తున్నానని, మేనేజ్​మెంట్ తనతో పాటు అందరినీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.

కాలేజీలో అన్ని సౌలత్​లు ఉండడంతో పాటు ఫ్యాకల్టీ ఇచ్చిన స్టడీ మెటీరియల్, కరస్పాండెంట్ సరోజా వివేక్ దిశా నిర్దేశంతో కష్టపడి చదివినందుకు ఈ ఫలితం వచ్చిందని చెప్పారు. ఫ్యాకల్టీ చాలా టిప్స్ చెప్పారని, వచ్చే ఏడాది కోసం మంచి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ప్రారంభిస్తున్నానని, ఇంత సక్సెస్ వెనకాల మేనేజ్​మెంట్ కృషి ఎంతో ఉందని తెలిపింది.