కాళేశ్వరం నుంచి కరీంనగర్‌‌‌‌కు నీరెందుకియ్యలే ? : మంత్రి లక్ష్మణ్‌‌‌‌కుమార్‌‌‌‌

కాళేశ్వరం నుంచి కరీంనగర్‌‌‌‌కు నీరెందుకియ్యలే ? : మంత్రి లక్ష్మణ్‌‌‌‌కుమార్‌‌‌‌
  • మంత్రి లక్ష్మణ్‌‌‌‌కుమార్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ ద్వారా ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాకు సాగు, తాగు నీరు ఎందుకు ఇవ్వలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ప్రశ్నించారు. మంగళవారం ఆయన గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడారు. గోదావరి ఒడ్డున ఉన్న మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ నుంచి చుక్క నీరు ఇప్పించలేని కొప్పుల ఈశ్వర్‌‌‌‌.. కన్నేపల్లి పంప్‌‌‌‌ హౌస్‌‌‌‌ వద్దకు వెళ్లి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్‌‌‌‌ చేయడం సరికాదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం సరిగా లేదని సెంట్రల్‌‌‌‌ వాటర్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ అథారిటీ చెప్పినందునే నీటిని నిల్వ చేయడం లేదన్నారు. జస్టిస్‌‌‌‌ పీసీ ఘోష్‌‌‌‌ ఇచ్చిన రిపోర్ట్‌‌‌‌ ఆధారంగానే కేబినెట్‌‌‌‌ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. 

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ల అవినీతిని బట్టబయలు చేశామన్న ఆగ్రహంతోనే కాంగ్రెస్‌‌‌‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌‌‌‌ హయాంలో నిర్మించిన అనేక ప్రాజెక్ట్‌‌‌‌లు ఇప్పటికీ చెక్కుచెదరలేదని, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయిందో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. కాళేశ్వరం రిపోర్ట్‌‌‌‌పై బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు చర్చకు రావాలని సవాల్‌‌‌‌ చేశారు. మీటింగ్‌‌‌‌లో నాయకులు కాల్వ లింగస్వామి, మహాంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేశ్‌‌‌‌,​ ఎండీ. ముస్తఫా, పెద్దెల్లి ప్రకాశ్, కళ్యాణి సింహాచలం, బొమ్మక రాజేశ్, మండ రమేశ్‌‌‌‌, దూళికట్ట సతీశ్‌‌‌‌ పాల్గొన్నారు.