
కామారెడ్డిటౌన్, వెలుగు : ఫొటోలు జ్ఞాపకాలకు జీవంగా ఉంటాయని అడిషనల్ కలెక్టర్ చందర్నాయక్అన్నారు. మంగళవారం కామారెడ్డి రోటరీ క్లబ్ఆధ్వర్యంలో వరల్డ్ఫొటోగ్రఫీ డే నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ హాజరై మాట్లాడారు.
ఫొటోగ్రఫీ జీవితాన్ని చిత్రీకరించే ఒక ఆయుధమన్నారు. ఫొటో చరిత్రలో జ్ఞాపకంగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం ఫొటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్గవర్నర్ జైపాల్‌రెడ్డి, ప్రెసిడెంట్ శంకర్, సెక్రటరీ కృష్ణహరి, ప్రతినిధులు పాల్గొన్నారు.