ఫోరెన్సిక్ వెహికల్ ప్రారంభం

ఫోరెన్సిక్ వెహికల్ ప్రారంభం

కామారెడ్డిటౌన్, వెలుగు:మొబైల్ ఫోరెన్సిక్​వెహికల్​ను గురువారం ఎస్పీ రాజేశ్​చంద్ర జెండా ఊపి ప్రారంభించారు. నేరాలు జరిగినప్పుడు సంఘటనా స్థలాల్లో  సాక్ష్యాలను సేకరించి నిందితులను గుర్తించేందుకు 
ఫోరెన్సిక్​ విభాగానికి వెహికల్​ కేటాయించారు. 

ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు   అత్యాధునిక పరికరాలతో రూపొందించిన మొబైల్ ఫోరెన్సిక్​వెహికల్ మెరుగైన సేవలు అందించనుందన్నారు. నేరం జరిగిన స్థలంలో ఫింగర్ ఫ్రింట్స్, పలు రకాల సాక్ష్యాలు సేకరించవచ్చన్నారు.  అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి,  డీఎస్పీ శ్రీనివాస్​రావు, సీఐ శ్రీధర్ పాల్గొన్నారు.