కామారెడ్డిటౌన్, వెలుగు : ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీసు ఆఫీసులో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పోలీసు యంత్రాంగం అలర్ట్గా ఉండాలన్నారు. తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల లొకేషన్లను విజిట్ చేసి అక్కడి పరిస్థితులను రివ్యూ చేయాలన్నారు.
అల్లర్లు చేసే వారిని ముందస్తుగా బైండోవర్ చేయాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ మద్యం, ఇతర వస్తువులు రవాణా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 8712686133కి సమాచారం ఇవ్వాలన్నారు.
