
- ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ రాజేశ్చంద్ర అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. నిజాంసాగర్ చౌరస్తాలో వెహికల్స్ టర్నింగ్కు కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలన్నారు. వీ6 వెలుగులో ప్రచురితమైన ‘ట్రాఫిక్ పీఎస్ వచ్చేనా..?’ కథనానికి ఎస్పీ స్పందించారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి, టౌన్ సీఐ నరహరి, ఎస్బీ సీఐ శ్రీధర్ తదితరులు ఉన్నారు.
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. బుధవారం కామారెడ్డి, అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 100 డయల్ చేయాలన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నం. 08468- 220069కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. వరద ఉధృతంగా ప్రవహించే చోటుకు ప్రజలు వెళ్లవద్దన్నారు. రోడ్లకు ఇరువైపులా స్టాపర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా ఇండ్లు కూలే పరిస్థితి ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.