ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు వేధిస్తున్నరు

ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు వేధిస్తున్నరు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గనుకుల కొండాపూర్ సర్పంచ్ లింగంపల్లి జ్యోతి భర్త బాలరాజుకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీఆర్ఎస్ కు చెందిన ఉపసర్పంచ్ భర్త, వార్డు సభ్యులు కావాలనే.. కక్షపూరితంగా, మానసికంగా వేధిస్తున్నారన్నారు. గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఉపసర్పంచ్ కు చెక్ పవర్ ఇవ్వడం వల్లే గ్రామాభివృద్ధి చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ పనులకు ఖర్చు చేసిన 20 లక్షల రూపాయలకు ఎలాంటి బిల్లులు రాకపోవడంతో 27 గుంటల భూమిని అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం అభివృద్ధికి చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం బాలరాజు మరో సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. కల్యాణలక్ష్మి, ఇతర పథకాల లబ్ధిదారుల నుంచి గ్రామ ఉప సర్పంచ్ భర్త డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.