
కాకినాడ జిల్లా తునిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బండితో సహా సజీవ దహనమయ్యాడు. బెండపూడి, కత్తిపూడి మధ్య ఉన్న హైవేపై రెండు బైక్ లు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు దగ్ధం కాగా.. ఓ వ్యక్తి బైక్‌పైనే సజీవదహనం అయ్యాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.