కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి

కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
  • కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అక్రమాలు నిజమేనంటూ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ పై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: ‘‘కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అవినీతి జరుగుతోందని నేను మాట్లాడితే.. సీఎం కేసీఆర్ కొట్టి పారేశారు... అవినీతి జరగడంలేదని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్దాలు చెప్పారు.. 43 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది.. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు? అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. 
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో అవినీతి జరుగుతోందని నేను అసెంబ్లీలో మాట్లాడితే కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు.. నా మాటలను కొట్టి పారేశారు.. ఇప్పుడు విజిలెన్సు అధికారులు విచారించి ఇచ్చిన నివేదిక చూస్తే.. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలు చెప్పినట్లు స్పష్టమవుతోంది..’ అన్నారు. అసెంబ్లీలో నన్ను అడ్డుకున్న కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని  రాజాసింగ్ డిమాండ్ చేశారు.