అడగకముందే కొడుక్కి అన్నీ కొనిపెట్టే నాన్న కేసీఆర్

V6 Velugu Posted on Sep 25, 2021

  • రెడ్డి అంటే పౌరుషం, ధైర్యం.. అన్నా అని పిలిస్తే పలికేవాడే రెడ్డి
  • టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి

కరీంనగర్: బొమ్మరిల్లు సినిమాలో ప్రకాశ్ రాజ్ లాంటి నాన్న కేసీఆర్.. అడగకముందే కొడుకుకు అన్ని కొనిపెట్టే నాన్నలాంటి వాడు కేసీఆర్ అని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే రెడ్డి అంటే పౌరుషం.. ధైర్యం.. అన్నా అని ఎవరైనా పిలిస్తే పలికేవాడే రెడ్డి అని ఆయన అభివర్ణించారు. శనివారం జమ్మికుంటలో జరిగిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ వదిలిన బాణం హరీశ్ రావు అన్నారు. 
మంత్రి హరీష్ రావు ఏం తప్పు చేశాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తిడుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అమిత్ షా దండవేస్తే ఈటల సంబరపడుతున్నాడు.. కానీ బలిచ్చే ముందు మేకను అలంకరిస్తారని ఆయనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. ఈటల రాజేందర్ పౌరసరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు తాలుతప్ప పేరుతో కట్ చేసిన పది కిలోల డబ్బులు ఈటల రాజేందర్ జేబులోకి పోయాయని ఆయన ఆరోపించారు. 
 

Tagged Karimnagar, jammikunta, , Kaushik Reddy, Huzuarabad, TRS leader Padi Kaushik Reddy, reddy means manhood, reddy means courage, KCR providing everything, mankind cm kcr

Latest Videos

Subscribe Now

More News