కేసీఆర్ దళితబంధు కాదు దళిత శత్రువు

కేసీఆర్ దళితబంధు కాదు దళిత శత్రువు

30న జరిగే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఏడోసారి మళ్లీ గెలిపించాలని కోరారు కర్నాటకకు చెందిన మాజీ ఎంపీ మునుస్వామి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన బీజేపీ దళిత మోర్చా సభలో పాల్గొని మాట్లాడారు మునుస్వామి. ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదన్నారు. కేసీఆర్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారని అన్నారు. కేసీఆర్ బుర్రలో ఉన్న బ్రెయినంతా ఈటల రాజేందర్ ది మాత్రమేనని చెప్పారు. చాలా మందిని ఉపయోగించుకుని సీఎం అయిన కేసీఆర్.. ఏడేళ్లలో ఒక్కనాడు అంబేద్కర్ విగ్రహానికి దండ వేయలేదన్నారు. కేసీఆర్ దళితబంధు కాదు.. దళిత శత్రువు అని తెలిపారు.

 దళితుడిని సీఎంను చేస్తానని.. మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ అన్నాడు. అలాంటిదే దళితబంధు కూడా అని అన్నారు మునుస్వామి. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి.. బెంగళూరును పిచ్చి ఆస్పత్రికి పంపించాలన్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ కుటుంబంలాగే...కేసీఆర్ కుటుంబాన్ని కూడా ఇంటికే పరిమితం చేయాలని ప్రజలను కోరారు.