కేరళలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

కేరళలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

తిరువనంతపురం: కరోనా సెకండ్ వేవ్ కేసులతో ఇప్పటికీ సతమతం అవుతున్న కేరళలో ఇప్పుడు ఒమిక్రాన్ కూడా ఎంటరైంది. రాష్ట్రలో తొలి ఒమైక్రాన్‌ కేసు ఆదివారం నమోదు అయింది. బ్రిటన్‌ నుంచి కొచ్చి వచ్చిన ఓ ప్రయాణికుడికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. ఈనెల 6వ తేదీన ఈ బ్రిటన్ నుంచి కోచికి వచ్చిన సదరు ప్రయాణికుడికి ఎయిర్‌ పోర్టులో జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. దీంతో అదే విమానంలో కోచి వచ్చిన ప్రయాణికులందరినీ ఐసొలేషన్ సెంటర్లో ఉంచారు. 
కరోనా నిర్ధారణ అయిన యువకుడి శాంపిల్స్ ను జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఇవాళ ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. ఒమిక్రాన్ కేసులు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆమె స్పష్టం చేశారు.