క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కట్టుదిట్టంగా అమలు చేయాలి : అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ

క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కట్టుదిట్టంగా అమలు చేయాలి : అడిషనల్ కలెక్టర్  డాక్టర్ శ్రీజ
  •     ఖమ్మం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్  డాక్టర్ శ్రీజ

ఖమ్మం టౌన్, వెలుగు : క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్ యాక్ట్ కట్టుదిట్టంగా అమలు చేయాలని ఖమ్మం స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ డాక్టర్​ శ్రీజ సూచించారు.  క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద జిల్లాలో అనుమతులు, రెన్యువల్స్ కోసం వచ్చిన దరఖాస్తులలో ఆమోదించినవి, తిరస్కరించిన, పెండింగ్ లో ఉన్న వాటిపై మంగళవారం వైద్య అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రులను సీజ్ చేసిన తర్వాత  కోర్టులలో పెండింగ్ ఉన్న కేసుల్లో సరైన ఆధారాలతో కౌంటర్ దాఖలు చేయాలన్నారు.

 ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన పరికరాల కొనుగోలు నిబంధనల ప్రకారం మాత్రమే చేయాలన్నారు. సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ ప్రసాదరావు, డీఎంహెచ్​వో కళావతి బాయి, డిప్యూటీ డీఎంహెచ్​వో చందునాయక్,  ఐఏంఏ అధ్యక్షుడు డాక్టర్​ రెహానా బేగం, ప్రోగ్రాం అధికారులు వెంకట రమణ, రామారావు,  ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్​ నరేందర్, ఈసీహెచ్​ఎస్​ డాక్టర్​రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.