
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్డాక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు.
వివిధ సమస్యలతో కూడిన 70 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఏ. పద్మశ్రీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
కేఎంసీ లో గ్రీవెన్స్..
కేఎంసీ లో గ్రీవెన్స్ లో భాగంగా 60 డివిజన్ల ప్రజల నుంచి కమిషనర్ అభిషేక్ అగస్త్య నార్త్ జోన్ బల్లేపల్లి, సౌత్ జోన్ ఓల్డ్ మున్సిపాలిటీ లో వార్డు ఆఫీసర్లు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. సమస్యలపై విభాగాల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి కమిషనర్పలు సూచనలు చేశారు. కాగా, ఖమ్మం సిటీలోని కేఎంసీలో సోమవారం మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు.