
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రశాంతంగా గణేశ్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, గణేష్ మండపాలకు విద్యుత్ సరఫరా, నిమజ్జనం పాయింట్ల వద్ద ఏర్పాట్లు తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరశీలిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. సీపీ మాట్లాడుతూ నిమజ్జనం రోజు ఊరేగింపు కార్యక్రమం, చివరి పూజ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రారంభించాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.
అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ నగరాలు, పట్టణ స్థాయిలో కూడా వినాయక నిమజ్జనం, నవరాత్రి ఉత్సవాలపై రివ్యూ సమావేశం నిర్వహించాలన్నారు. మున్సిపాలిటీ స్థాయిలోనే వివిధ శాఖల మధ్య కోఆర్డినేషన్ ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ ఏ. పద్మ శ్రీ, టీజీ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసా చారి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, సహాయ ఎక్సైజ్ పర్యవేక్షకులు వి. వేణుగోపాల్ రెడ్డి, డీఎంహెచ్వో కళావతి బాయి, జిల్లా అగ్నిమాపక అధికారి అజయ్ కుమార్, ఇరిగేషన్ అధికారి వెంకట్రామ్, జిల్లా రవాణా అధికారి వెంకట రమణ, ఆర్ అండ్ బీ ఈఈ పవార్, ఖమ్మం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్, ఎఫ్ఆర్ఓ. నాగేశ్వర రావు, ఈఈ పంచాయతీ రాజ్ యు. మహేశ్ బాబు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రవీందర్, మున్సిపల్ కమీషనర్లు, తహసీల్దార్లు, స్థంభాద్రి గణేష్ ఉత్సవ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ ఉన్నారు.