
- ఖమ్మం డీఎంహెచ్వో కళావతి బాయి
తల్లాడ, వెలుగు : తల్లి ఇచ్చే మొదటి పాలే బిడ్డకు మొదటి టీకాగా ఉపయోగపడుతుందని ఖమ్మం ఆరోగ్యశాఖ ఆఫీసర్ డాక్టర్ కళావతి బాయి అన్నారు. బుధవారం తల్లాడ పీహెచ్ సీలో గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో వెంకటరమణ తో కలిసి ఆమె పరిశీలించారు. గర్భిణులకు సహజ ప్రసవం ప్రాముఖ్యతను వివరించారు. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడంతో కలిగే ఉపయోగాలను తెలిపారు. 19 ఏండ్ల లోపు పిల్లలకు ఈనెల 11న నులిపురుగుల నివారణకు ఆల్బెండాజోల్ మాత్రలు వేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తల్లాడ పీహెచ్ సీ డాక్టర్ ప్రత్యూష, హెల్త్ సూపర్వైజర్ కొత్తా పెద్ద పుల్లయ్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పించాలి
కల్లూరు : కల్లూరులోని ఎన్ఎస్పీ క్యాంపస్ ఆవరణలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను డీఎంహెచ్వో కళావతి బాయి బుధవారం సందర్శించారు. ఇక్కడ రెండు రోజుల కింద విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురి కావడంతో కారణాలపై ఆరా తీశారు. హాస్టల్ పరిసరాలను, వంటగదిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కల్లూరు పీహెచ్సీని సందర్శించారు. విద్యార్థులకు అందించిన వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సీతారాం, జిల్లా మలేరియా అధికారి వెంకటరమణ, వైద్యాధికారి నవ్య కాంత్ ఉన్నారు .