39 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగాప్రమోషన్

39 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగాప్రమోషన్

ఖమ్మం టౌన్, వెలుగు  : పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్ లలో బాధ్యతలు నిర్వహించి నిరంతరంగా సేవలందించి హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగన్నతి పొందిన కానిస్టేబుళ్లను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం పోలీస్ కమిషనర్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, అభినందనలు తెలియజేశారు.

 ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 39 మంది పోలీసు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కలిపిస్తూ..22 మంది మహబూబాబాద్ జిల్లా,13 మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒకరు ఖమ్మం జిల్లాకు, ముగ్గురు ఇతర విభాగలకు కేటాయించి బదిలీ చేశారు.