అమెరికా స్కూల్‌లో కాల్పులు: ఇద్దరు చిన్నారుల బలి, ఆయుధాలపై చిరాకు పుట్టించే రాతలు..

అమెరికా స్కూల్‌లో కాల్పులు: ఇద్దరు  చిన్నారుల బలి, ఆయుధాలపై చిరాకు పుట్టించే రాతలు..

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది.  మిన్నెసోటా మిన్నియాపాలిస్ సిటీలో ఒక కాథలిక్ స్కూల్లో బుధవారం ఉదయం ఓ 23 ఏళ్ల వ్యక్తి దారుణంగా కాల్పులకి తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో సుమారు ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు. 

పోలీసుల సమాచారం ప్రకారం  రాబిన్ వెస్ట్‌మన్‌గా గుర్తించిన దుండగుడు ఈ కాల్పుల్లో ఒక రైఫిల్, ఒక షాట్‌గన్, ఒక పిస్టల్ సహా మూడు ఆయుధాలను  ఉపయోగించాడు. వెస్ట్‌మన్ ప్రార్థన సమయంలో  ఓ చర్చిలోకి చొరబడి  అక్కడ కూర్చున్న పిల్లల వైపు కిటికీల నుండి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. అయితే చనిపోయిన పిల్లలు సుమారు 8 నుండి 10 సంవత్సరాల వయస్సు ఉన్నవారే.  కాల్పుల  తర్వాత అతను పార్కింగ్ స్థలంలో చనిపోయి కనిపించాడు.

ఈ ఘటనకి ముందు దుండగుడు తన రాబిన్ డబ్ల్యూ అనే యూట్యూబ్ ఛానల్లో  ఒక వీడియోను పోస్ట్ చేశాడు, అందులో తుపాకులపై డోనాల్డ్ ట్రంప్‌ను చంపు, ఇజ్రాయెల్ పడిపోవాలి, న్యూక్ ఇండియా అంటూ రాతలు ఉన్నాయి.  అతని తుపాకులపై  ఇలాంటి మరికొన్ని రాతలు కూడా కనిపించాయి. అయితే వీడియోలో  2020లో తన పేరును రాబర్ట్ నుండి వెస్ట్‌మన్ గా మార్చుకున్నట్లు తెలిసింది. యూట్యూబ్ ఆ వీడియో ఛానెల్‌ వెంటనే తొలగించింది.

అమెరికాలో నేరాలను ట్రాక్ చేసే  టైమ్ క్రైమ్ ఇండెక్స్ ప్రకారం 2024లో హత్యల సంఖ్య 21% తగ్గినప్పటికీ, ఈ ఘటన అమెరికాలో మరోసారి తీవ్ర  కలకలం రేపింది.