కిమ్స్ క‌డ‌ల్స్ ఆధ్వర్యంలో మిసెస్ మామ్

కిమ్స్ క‌డ‌ల్స్ ఆధ్వర్యంలో మిసెస్ మామ్

హైద‌రాబాద్ సిటీ, వెలుగు: తల్లిదండ్రులు కాబోతున్న జంటలకు అవగాహన పెంచడమే లక్ష్యంగా కిమ్స్ కడల్స్ దవాఖాన క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె. శిల్పిరెడ్డి క్రయోవివా సహకారంతో మిసెస్ మామ్-2025 సీజన్ 9ను నిర్వహిస్తున్నారు. 

న‌వంబ‌ర్ 9 నుంచి డిసెంబ‌ర్ 7 వ‌ర‌కు జరిగే ఈ కార్యక్రమంలో త‌ల్లిదండ్రుల‌య్యే జంట‌లంద‌రూ ఇందులో ఉచితంగా పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ నిపుణులు, అనుభ‌వ‌జ్ఞులైన డాక్టర్ల నుంచి  గ‌ర్భం, ప్రస‌వం, భర్త, కుటుంబం సహకారం, పిల్లల సంర‌క్షణ‌, యోగా త‌దిత‌ర అంశాల‌ గురించి తెలుసుకోవచ్చన్నారు. తుది విజేతకు డా.శిల్పి రెడ్డి  ఫ్రీగా డెలివరీ చేస్తారన్నారు.